విడాకులపై జయం రవి ఏకపక్ష ప్రకటన... విషయం తెలిసి షాక్ అయిన భార్య ఆర్తి
3 months ago | 36 Views
భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. బహిరంగ ప్రకటన చూసి తాను దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈమేరకు సోషల్ విూడియాలో ఓ నోట్ విడుదల చేశారు. నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా.
దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు షాకయ్యాం. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి.. నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విూ ప్రేమే మాకు బలం. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి పేర్కొన్నారు.
ఇంకా చదవండి: 'జై హనుమాన్' కోసం భారీగా కసరత్తు...దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!