
అల్లుఅర్జున్‌తో జాన్వీకపూర్ రొమాన్స్ !?
1 month ago | 5 Views
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప తర్వాత బన్నీ ఏం సినిమా చేయబోతున్నాడనే చర్చ సాగుతున్నది. సమాచారం మేరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నాడనే వార్త తెగ వైరల్‌గా మారింది. అయితే, ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. ఈ మూవీని పక్కన పెట్టి బన్నీ తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీతో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతున్నది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. చాలారోజులుగా బన్నీతో అట్లీ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇద్దరి కాంబోలో హై యాక్షన్ సినిమా తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తున్నది. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు. ఇక అల్లు అర్జున్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఇంకా చదవండి: అనుపమా పరమేశ్వరన్‌కు ‘డ్రాగన్’ బర్త్‌డే గిఫ్ట్ అయ్యేనా..?
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!