కరణ్ సలహాతో ..తెలుగులోకి జాన్వీ ఎంట్రీ!
3 months ago | 35 Views
శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి వచ్చిన జాన్వీకపూర్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. అయితే ఈ అమ్మడు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం వెనక ఓ స్టార్ దర్శకనిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఎంతో మంది నటీనటులు వారి కెరీర్ గురించి కరణ్ జోహర్ సలహాలు తీసుకుంటూ ఉంటారని టాక్. అలానే జాన్వీకి కూడా కరణ్ ఓ సూచన చేశారట. బీటౌన్‌లో తొలి అవకాశం అందుకున్న తర్వాత జాన్వీ తమిళ, తెలుగులో ఛాన్స్‌లు వచ్చాయని దీంతో ఆమె కోలీవుడ్.. టాలీవుడ్‌లలో దేన్ని ఎంచుకోవాలో కరణ్‌ను సలహా కోరినట్లు సమాచారం. ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తే తెలుగులో మంచి ఛాన్స్‌లు వస్తాయని కరణ్ ఆమెతో చెప్పారట.
దీంతో జాన్వీ వెంటనే 'దేవర’ను ఓకే చేసేశారు. కరణ్ సలహా ఈ భామకు కలిసొచ్చినట్లే ఇక్కడ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తుండగానే మెగా హీరో రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేశారు. నానితో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల వస్తున్నాయి. బీటౌన్‌లో జాన్వీ ఇప్పటి వరకు చిన్న హీరోల సినిమాల్లోనే నటించారు. కానీ, తెలుగులో మాత్రం తొలి సినిమానే ఎన్టీఆర్‌తో ఆడిపాడనున్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌కు పోటీ ఇవ్వలేని జాన్వీ.. ఇక్కడ మాత్రం టాప్ లిస్ట్ హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'దేవర’లో ఇప్పటి వరకు రిలీజైన పాటల్లో జాన్వీ అందానికి, డ్యాన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా రిలీజైన 'దావుదీ..’ సాంగ్‌లో ఎన్టీఆర్‌తో సమానంగా డ్యాన్స్ చేసిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలయ్యాక జాన్వీ మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయమని వారు భావిస్తున్నారు.
ఇంకా చదవండి: హాలీవుడ్ ఈవెంట్‌లో 'దేవర' ప్రదర్శన.. అభిమానుల్లో జోష్ పెంచిన వార్త!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# JanhviKapoor # Sridevi # Bollywood