శ్రీదేవి జయంతి రోజు శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ

శ్రీదేవి జయంతి రోజు శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ

4 months ago | 56 Views

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తల్లి, అతిలోకసుందరి శ్రీదేవి 61వ జయంతి సందర్భంగా.. ప్రతి ఏడాది తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ మంగళవారం ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గతంలో శ్రీదేవి  సైతం తిరుమల శ్రీనివాసుడిపై ఉన్న భక్తితో తన ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలకి వచ్చి దర్శనం చేసుకునేవారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తన మదర్‌ అనే కాకుండా.. తనకు వీలునప్పుడల్లా తిరుపతి ఆలయాన్ని జాన్వీ కపూర్‌ సందర్శిస్తూనే ఉన్నారు.  తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్‌ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత జాన్వీ కపూర్‌ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేశారు. అచ్చమైన తెలుగమ్మాయిలా పట్టుచీరలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు జాన్వీ. పక్కనే జాన్వీ స్నేహితుడు, సన్నిహితుడైన శిఖర్‌ పహారియా కూడా ఉన్నారు. ఇక తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఆమె ఒక పోస్ట్‌ చేశారు.


ఇందులో తిరుపతి మెట్లు, తల్లితో తన చిన్నప్పటి ఫొటో, తాను చీరలో ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. హ్యాపీ బర్త్‌ డే అమ్మా. ఐ లవ్యూ అని జాన్వీ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. తిరుమల కొండతో పాటు.. తాను చీర కడితే తన తల్లి శ్రీదేవికి చాలా ఇష్టమని జాన్వీ కపూర్‌ గతంలో పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్‌ సినిమాల విషయానికి వస్తే.. 'దేవర’సినిమాలో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న జాన్వీకి వరుస అవకాశాలు వరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 'దేవర’ సినిమా సెట్స్‌పై ఉండగానే.. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్‌లో ఆమె సెలక్ట్‌ అయింది. ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. అలాగే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన ఆమె చేస్తున్న 'దేవర’ సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ , రామ్‌ చరణ్‌  సినిమాలే కాకుండా.. మరో రెండు మూడు ఆఫర్లు కూడా ఆమెకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు కోలీవుడ్‌లోనూ ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

ఇంకా చదవండి: నా పై వార్తలు రాసే ముందు సంప్రదించరా : డేటింగ్‌పై సోషల్‌ విూడియా ప్రచారంపై కృతి ఆగ్రహం

# JahnviKapoor     # Sridevi     # Bollywood    

related

View More
View More

trending

View More