'ఉలాజ్'తో ముందుకొచ్చిన జాన్వీ!
4 months ago | 43 Views
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ శుక్రవారం 'ఉలాజ్'చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, కథల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ’కెరీర్‌ను మార్చే అవకాశమైనా.. జుట్టు లేకుండా కనిపించే పాత్రను అంగీకరించను అన్నారు. 'ఎలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారు?’ అని యాంకర్ అడగ్గా జాన్వీ స్పందించారు. హెయిర్ లేకుండా నటించాల్సి వస్తే నేనెప్పుడూ సున్నితంగా తిరస్కరిస్తా. ఎంత కష్టమైన పాత్రైనా చేస్తాను కానీ జుట్టు లేకుండా కనిపించేందుకు ఇష్టపడను. ’ఉలాజ్’లోని పాత్ర కోసం దర్శకుడు నా హెయిర్‌ను కొంత కట్ చేయాలని సూచించారు.
అందుకు నేను ఆయనతో గొడవపడ్డా నా తొలి సినిమా 'ధడక్’ కోసం జుట్టు కత్తిరించుకున్నా. ’ఎందుకిలా చేశావ్?’ అంటూ మా అమ్మ అరిచింది. ఏ రోల్ కోసమైనా హెయిర్ కట్ చేసుకోవద్దని చెప్పింది. నా జుట్టంటే ఆమెకు అంత ఇష్టం. మూడ్రోజులకోసారి ఆయిల్ రాసి మసాజ్ చేస్తది. అమ్మ కారణంగానే హెయిర్ కట్ చేసుకోను‘ అని అంది జాన్వీకపూర్. గుల్షన్ , జాన్వీకపూర్, రోషన్ మాథ్యు కలిసి నటించిన చిత్రమిది. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందింది. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో దేవర చిత్రంలో నటిస్తోంది. రెండు పార్టులుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తదుపరి రామ్‌చరణ్, సానా బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కే చిత్రంలో ఆమె అవకాశం అందుకుంది.
ఇంకా చదవండి: దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్
# Ulajh # JahnviKapoor # RoshanMathew