జగపతిబాబు ఆ సినిమాకు రెమ్యూనేషన్ తీసుకోలేదు!?
1 month ago | 5 Views
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తన నిర్మాణంలో వచ్చిన ఒక సినిమాకు అసలు డబ్బులు తీసుకోకుండా నటించినట్లు తెలిపాడు. ప్రకాశ్‌రాజ్, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'ఆకాశమంతా... ' ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించగా.. రాధ మోహన్ దర్శకత్వం వహించాడు. తండ్రికూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
ఈ సినిమాకు జగపతిబాబు రెమ్యూనరేషన్ తీసుకోలేదని వెల్లడించాడు. ఈ మూవీ టైంలో ఒక పాత్ర ఉంది చేస్తారా? అని జగపతిబాబును సంప్రదించాం.. అయితే ఈ పాత్ర నచ్చడంతో మూవీ ఒకే చెప్పాడు. అనంతరం రెమ్యూనరేషన్ టాపిక్ వస్తే.. ఫ్రీగా చేస్తాను అన్నాడు. దీంతో మేం అందరం షాక్ అయ్యాం. అయితే జగపతిబాబు మాట్లాడుతూ.. నాకు వేతనం వద్దు రాజు.. మంచి చిత్రంలో భాగం అవుతున్న అది చాలు అన్నాడు. దీంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ రాజు చెప్పుకొచ్చాడు.
ఇంకా చదవండి: "విడుదల 2" చిత్రాన్ని ఫాన్సీ రేటుకు దక్కించుకున్న శ్రీ వేధక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# జగపతిబాబు # దిల్‌రాజు # ఆకాశమంతా