నేను సోలోగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది.. : రామ్‌చరణ్‌

నేను సోలోగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది.. : రామ్‌చరణ్‌

6 hours ago | 5 Views

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండగా.. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ శంకర్‌ దిల్‌ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నేడు అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్‌ టైం ఒక ఇండియన్‌ సినిమాను అందులో ఒక తెలుగు సినిమాను ఇండియాలో కాకుండా వేరే దేశంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా.. ఇప్పటికే నటుడు రామ్‌ చరణ్‌తో పాటు నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు శంకర్‌లు డల్లస్‌లో ల్యాండ్‌ అయ్యారు. రామ్‌ చరణ్‌ అమెరికాకు చేరుకోగానే మెగా అభిమానులు నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ప్రీ రిలీజ్‌ వేడుకకు ముందు ప్రెస్‌ మీట్‌ నిర్వహించగా.. ఇందులో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. తన సినిమా సోలోగా వచ్చి నాలుగు ఏండ్లు అవుతుందని తెలిపాడు. ’’నేను సోలోగా వచ్చి నాలుగు ఏండ్లు అవుతుంది. చివరిగా నా బ్రదర్‌ తారక్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేశాను. ఇప్పుడు వస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాతో మిమ్మల్ని అస్సలు నిరాశపరచము. అది మనందరికీ అద్భుతమైన సంక్రాంతి అవుతుందంటూ’’ రామ్‌ చరణ్‌ చెప్పుకొ చ్చాడు.

ఇంకా చదవండి: పుష్ప 2 సినిమాకు వద్దనడంతో యువతి ఆత్మహత్యాయత్నం

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రామ్‌చరణ్‌     # శంకర్‌    

trending

View More