అన్నయ్య చిరంజీవి గారి పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం
3 months ago | 34 Views
అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈ రోజు అన్నయ్య గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
ఆంధ్ర ప్రదేశ్
ఇంకా చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవాన్ని పొందిన పద్మవిభూషణ్ చిరంజీవి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!