చిరు ఫ్యాన్స్‌  తిట్టుకున్నా ఫర్వాలేదు...  'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్‌' బాగా తీశాడు : నాగవంశీ

చిరు ఫ్యాన్స్‌ తిట్టుకున్నా ఫర్వాలేదు... 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్‌' బాగా తీశాడు : నాగవంశీ

21 hours ago | 5 Views

సినిమా విడుదల సమయంలో సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసే నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్‌ అభిమానులు తిట్టుకున్నా ఫర్వాలేదు. కానీ దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ కంటే ‘డాకు మహారాజ్‌’ సినిమాని బాగా తీశాడు’ అని కామెంట్స్‌ చేశాడు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్‌ తనని తిట్టుకున్నా పర్లేదని స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  విలేకరుల సమావేశంలో నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన చిత్రం ‘డాకు మహరాజ్‌’. శ్రద్థా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదల  కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. మరో ఈవెంట్‌ విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘‘ బాలకృష్ణతో వర్క్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్తగా చూస్తారు. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ ఇలాంటి లుక్‌లో ఆయన కనిపించలేదు.

అఖండ, లెజెండ్‌ గురించి ఎలా చెప్పుకుంటున్నారో దీని గురించి కూడా అలానే మాట్లాడుకుంటారు. సినిమా ఇంటర్వెల్‌లోనే నాకు ఫోన్‌ చేసి ఈ మాట చెబుతారు. ఈ సినిమాకు సంబంధించి మూడు గ్రాండ్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేశాం. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. తర్వాత రెండు రోజులకు అమెరికాలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేసి అక్కడ ఓ పాటను విడుదల చేయనున్నాం. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నాం.

ఇంకా చదవండి: శ్రీతేజ్‌ను పరామర్శిస్తున్న ప్రముఖులు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# డాకు మహారాజ్‌     # నాగవంశీ    

trending

View More