ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా అదే..!?
5 hours ago | 5 Views
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్రజలతో మమేకం అవ్వడానికి సోషల్ మీడియాలో గడుపుతుంటాడు. అయితే ఒబామా అప్పుడప్పడు తన ఇష్టాలను నెటిజన్లతో పంచుకుంటాడు. ఈ క్రమంలోనే 2024 ఇయర్ ముగుస్తున్న నేపథ్యంలో తనకి ఈ ఏడాది నచ్చిన కొన్ని సినిమాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇందులో ఒక భారతీయ చిత్రం ఉండడం కూడా విశేషం. ఇంతకీ ఆ సినిమా పేరు. ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’. ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తాచాటిన ఈ చిత్రం రీసెంట్‌గా 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు నామినేట్ అయ్యింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేగాకుండా.. తనకు 2024లో నచ్చిన సినిమాలలో ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ చిత్రం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపాడు.
ఇంకా చదవండి: పెద్ద సినిమాకు పైరసీ కష్టాలు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఒబామాకు # సోషల్ మీడియా