స్టార్ నటి అనుష్క పెళ్లి కుదిరిందా..
3 months ago | 5 Views
స్టార్ నటి అనుష్క పెళ్లి కుదిరిందా..త్వరలోనే శుభవార్త వెలువడుతుందా.. ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది మంగళూరు భామ అనుష్కా శెట్టి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తూ మంచి పేరు సంపాదించింది. 'అరుంధతి' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ భామ 'బాహుబలి' ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకుంది. 'బాహుబలి' తర్వాత సినిమాలు తగ్గించిన స్వీటీ మరి పెండ్లి పీటలెక్కేదెప్పుడంటూ సోషల్ విూడియాలో చాలాకాలంగా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దీనికి సంబంధించిన వార్తే నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఈ భామ త్వరలోనే ఇక ప్రొఫెషనల్ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతుందట. తాజా టాక్ ప్రకారం అనుష్క దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందట. అనుష్క కుటుంబసభ్యులు ఈ సంబంధాన్ని కుదిర్చారని, తల్లిదండ్రుల పెండ్లి ప్రతిపాదనకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చింది అనుష్క. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇంకా చదవండి: ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్. టి. ఆర్. : కె. ఎస్. రామారావు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!