సినిమాటిక్‌ యూనివర్స్‌ చిత్రాలపై ఆసక్తి..  తదుపరి ముందుంటానన్న శంకర్‌

సినిమాటిక్‌ యూనివర్స్‌ చిత్రాలపై ఆసక్తి.. తదుపరి ముందుంటానన్న శంకర్‌

2 days ago | 8 Views

పాన్‌ ఇండియాలానే 'సినిమాటిక్‌ యూనివర్స్‌’ పదం చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఓ సినిమా కథా ప్రపంచాన్నో, అందులోని పాత్రలనో మరో సినిమాలో కొనసాగించడమే యూనివర్స్‌. హాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్‌ను బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ఫాలో అవుతున్నాయి. ఆ కాన్సెప్ట్‌ను దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్‌ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కు దక్కుతుంది.  'ఖైదీ’ (2019), 'విక్రమ్‌’ (2022) సినిమాలు ఆ కోవకు చెందినవే. 2008లోనే ఆ సాహసం చేయాలని ప్రయత్నించారు డైరెక్టర్‌ శంకర్‌. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. 'రోబో’ చిత్రీకరణ సమయంలో  సినిమాటిక్‌ యూనివర్స్‌ ఆలోచన వచ్చిందని శంకర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.'భారతీయుడు’, 'ఒకే ఒక్కడు’,'శివాజీ’లోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్టు తీయాలనే ఆసక్తి కలిగింది.

వెంటనే తన అసిస్టెంట్‌ డైరెక్టర్లను పిలిచి ఆ విషయం చెప్పా. ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వారు. అది వారికి నచ్చలేదని అర్థం చేసుకున్నా. తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులకు వివరించా. వారి నుంచీ ఆశించిన స్పందన రాలేదు. వారంతా సపోర్ట్‌ చేయకపోవడంతో తన ఆలోచనే కరెక్ట్‌ కాదేమోనని ఊరుకున్నా. కొన్నాళ్ల తర్వాత ’అవెంజర్స్‌’ మూవీ చూశాక.. 'భవిష్యత్తులో విూకు కొత్త తరహా కాన్సెప్ట్‌లతో సినిమా తీయాలనిపిస్తే వెంటనే తీసేయండి. లేదంటే ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు’ అని నా అసిస్టెంట్లకు చెప్పా‘ అని తన తాజా చిత్రం 'భారతీయుడు 2’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ వివరించారు. ఒకవేళ ఆయన అనుకున్నది సాధ్యమై ఉంటే 'శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఫస్ట్‌ యూనివర్స్‌గా నిలిచి ఉండేది. ఆ మూడు సినిమాలు, అందులోని కథానాయకుల పాత్రలు ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి: రూ.1000 కోట్ల వైపు వడివడిగా 'కల్కి'.. 'కల్కి పార్ట్‌-2 కూడా ఉంటుందన్న అశ్వినీదత్‌..

# Lokeshkanagaraj     # Rajinikanth     # Film