చిరు మూవీల్‌లో 'ఇంద్ర' ట్రెండ్ సెట్టర్!
4 months ago | 40 Views
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ముందుంటుంది ఇంద్ర సినిమా. అప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ కావు.. మాస్ కామెడీ సినిమాలకే మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లని ఈ సినిమాతో మూయించాడు మెగాస్టార్. దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే రూ.55 కోట్ల షేర్ వసూలు చేసింది. చిరంజీవి కెరీర్‌లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకుని వచ్చింది. ఇంద్ర విడుదలైన సమయంలో తెలుగు రాష్టాల్ల్రో ఒక పండగ వాతావరణం ఏర్పడిరది.
ఇక ఆ రోజుల్లోనే రూ.2000 బ్లాక్‌లో పెట్టి అభిమానులు ఈ సినిమా చూశారంటే ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా మూవీలో వచ్చే షౌకత్ అలీఖాన్, మొక్కే కదా అని పీకేస్తే అనే డైలాగ్స్ అభిమానులను ఉర్రుతలు ఊగించాయి. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 22 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాను మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.
ఇంకా చదవండి: ధనుష్ 'రాయన్' మూవీపై ఉత్కంఠ!
# Indra # Chiranjeevi # Prakashraj