ఆమెతో పనిచేస్తే మాయలో పడిపోవాల్సిందే..! : దర్శకుడు వాసన్‌బాల

ఆమెతో పనిచేస్తే మాయలో పడిపోవాల్సిందే..! : దర్శకుడు వాసన్‌బాల

2 months ago | 5 Views

ఆలియా భట్ ఓ మాయ.. ఒక్కసారి ఆమెతో పనిచేస్తే ఆ మాయలో ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె ఆరా మనల్ని కూడా కమ్మేస్తుంది.’ అంటున్నారు దర్శకుడు వాసన్‌బాల. ఇటీవలే అలియాతో ఆయన ‘జిగ్రా’ సినిమా తెరకెక్కించారు. ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా.. అలియాతో పనిచేశానన్న తృప్తి మాత్రం ‘జిగ్రా’ వల్ల లభించిందని ఆయన అన్నారు. 

జిగ్రా’ సీరియస్‌ సబ్జెక్ట్‌. ఆ కథలో కామెడీ లేదు. కానీ సెట్‌ అంతా ఎప్పుడు కామెడీగా ఉండేది. కారణం ఆలియా భట్. తను నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఓ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేయడం అలియా స్పెషాలిటీ. ఆమెతో ఒక్కసారి పనిచేశాక.. మళ్లీ ఇంకొకరితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే తనే గుర్తుకొస్తుంటుంది..’ అంటూ మాట్లాడారు వాసన్‌బాలా. దీనిబట్టి అలియా మాయ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.

ఇంకా చదవండి: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నాగచైతన్య దంపతులు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జిగ్రా     # ఆలియా భట్    

trending

View More