ఇలా చేస్తే ఎలా కిర్తీ..  కిర్తీ ఆఫర్‌కు అభిమానికి ఫిదా!!

ఇలా చేస్తే ఎలా కిర్తీ.. కిర్తీ ఆఫర్‌కు అభిమానికి ఫిదా!!

13 hours ago | 5 Views

కీర్తి సురేష్‌-వరుణ్‌ ధావన్‌ జంటగా నటించిన ‘బేబీ జాన్‌’ చిత్రం బుధవారం (డిసెంబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ హోదా తెచ్చుకున్న కీర్తి సురేష్‌ చేసిన తొలి బాలీవుడ్‌ చిత్రం ఇదే కావడం విశేషం. దీంతో కీర్తి సురేష్‌ ఫ్యాన్స్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా కోసం ఎదురుచూశారు. అందులోనూ ఇప్పటికీ ఈ సినిమాలోని ‘నైన్‌ మాటక్క’ సాంగ్‌ బాగా వైరల్‌ అయింది. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు ఈ పాటే కనిపిస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం వరుణ్‌ ధావన్‌తో కలిసి కీర్తి సురేష్‌ ముంబై మొత్తం చుట్టేసింది. పలు టీవీ షోలకి కూడా వెళ్లింది. ఇటీవల ఫేమస్‌ కపిల్‌ శర్మ షోలో కూడా కీర్తి సురేష్‌ సందడి చేసింది. ఆ షోకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో కీర్తి సురేష్‌తో మాట్లాడేందుకు ఓ ఫ్యాన్‌ స్టేజ్‌ మీదకి వచ్చాడు. అతని హెయిర్‌ చూసి ఏది ఇలా చెయ్‌ అంటూ రజినీ కాంత్‌ స్టయిల్లో జుట్టు ఎగరేసింది కీర్తి. సేమ్‌ అలానే ఆ ఫ్యాన్‌ కూడా చేశాడు. దీంతో ఎంత స్టయిల్‌గా ఉంది అంటూ కీర్తి అనగానే ఆ అభిమాని తెగ సిగ్గుపడిపోయాడు.


చూడు చూడు ఎంత సిగ్గుపడుతున్నాడో అంటూ మరో హీరోయిన్‌ వామికా గబ్బి అంది. దీనికి మరి ఫ్యాన్‌ కదా ఆ మాత్రం ఉంటుంది అంటూ ఆ అభిమాని అన్నాడు.  ఇంతలో సరే అంత దూరంగా నిల్చున్నావ్‌ దగ్గరికి రా అంటూ కీర్తి పిలిచింది. ఇదంతా చూసి వెంటనే కపిల్‌ లేచి.. ఆ ఫ్యాన్‌ హార్ట్‌పైన చేయిపెట్టి ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుందో అన్నాడు. దీంతో కీర్తి సురేష్‌ స్వయంగా వచ్చి తన అభిమాని గుండెపై చేయి పెట్టి దిల్‌ దడఖ్‌నా అంటూ క్యూట్‌గా అంది. ఇది చాలా.. ఇంకేమన్నా చెప్పాలా అని కీర్తి సురేష్‌ అనగానే వద్దువద్దు ఈ మూమెంట్‌లోనే అతనికి నాలుగేళ్లు గడిచిపోతాయ్‌ అంటూ కపిల్‌ సరదాగా అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరోవైపు బేబీ జాన్‌ సినిమాకి పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. వరుణ్‌ ధావన్‌ యాక్షన్‌, కీర్తి సురేష్‌ యాక్టింగ్‌, వామికా గబ్బి అందం అదిరిపోయాయ్‌ అంటూ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌ కేమియో కూడా చాలా బావుందంటూ టాక్‌ వస్తుంది. మొత్తానికి కీర్తి సురేష్‌ తన తొలి బాలీవుడ్‌ సినిమాతోనే మంచి హిట్టు అందుకుందన్నమాట.

ఇంకా చదవండి: క్రిస్మస్‌ రోజున నా కుమారుడు చనిపోయాడు : త్రిష

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# బేబీ జాన్‌     # కీర్తి సురేష్‌     # వరుణ్‌ ధావన్‌    

trending

View More