ఆఫర్‌ ఇస్తానంటే.. వార్నింగ్‌ ఇచ్చి వచ్చేశా : కావ్యా థాపర్‌

ఆఫర్‌ ఇస్తానంటే.. వార్నింగ్‌ ఇచ్చి వచ్చేశా : కావ్యా థాపర్‌

1 month ago | 5 Views

టాలీవుడ్‌ బిజీ హీరోయిన్స్‌లో కావ్యా థాపర్‌ ఒకరు. ఓటీటీ మూవీ ‘ఏక్‌ మినీ కథ’ ఆమె తొలిహిట్‌ కాగా, ఫస్ట్‌ థియేటర్‌ హిట్‌ ‘ఊరుపేరు భైరవకోన’. పూరీ జగన్నాథ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘ఈగల్‌’, గోపీచంద్‌ ‘విశ్వం’ సినిమాలతో బిజీ హీరోయిన్‌గా అవతరించింది కావ్యా థాపర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ ‘నేను నటిని కావడం మా నాన్న కల. ఆ కల నిజం చేయడానికే మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. మోడల్‌గా వచ్చిన గుర్తింపే, తర్వాత కాలంలో నన్ను హీరోయిన్‌ని చేసింది. కెరీర్‌ పరంగా ఇప్పుడు సంతృప్తిగా ఉన్నా.

Kavya Thapar : r/southactressgallery

భవిష్యత్‌ కూడా ఆశాజనకంగానే ఉంది. అయితే, నాకు ఈ స్థాయి తేలిగ్గా రాలేదు. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. మోడలింగ్‌ చేస్తున్న కొత్తలో ఓ వ్యక్తి ఆఫర్‌ ఇస్తానని నన్ను తన ఆఫీస్‌కి పిలిచాడు. తీరా వెళ్లాక, ‘కమిట్మెంట్‌ ఇస్తే నాలుగు యాడ్స్‌ ఆఫర్‌ ఇస్తా..’ అన్నాడు. నాకు అలాంటివి ఇష్టం ఉండదనీ, మరోసారి పిలవొద్దని వార్నింగ్‌ ఇచ్చి తిరిగొచ్చేశాను. గ్లామర్‌ ఫీల్డ్‌లో ఇలాంటివి సహజమని అప్పుడే అర్థమైంది. అందుకే.. బలహీనతలకు దూరంగా.. ఆత్మగౌరవంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. దేవుడి దయవల్ల ఆ తర్వాత నాకు అలాంటి అనుభవాలేం ఎదురుకాలేదు.’అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్‌.

ఇంకా చదవండి: ధనుష్‌పై నయన విమర్శలు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# కావ్యాథాపర్‌     # టాలీవుడ్‌     # విశ్వం    

trending

View More