లావుగా ఉంటే ..పెళ్లి చేసుకోకూడదా? నటి రోహిణి ఒకింత ఆగ్రహం
5 months ago | 40 Views
తన గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్‌ను ఉద్దేశించి నటి రోహిణి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాలో తాజాగా వీడియో షేర్ చేశారు. బర్త్‌డే బాయ్’ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ థీమ్‌తో ఒక ప్రాంక్ వీడియో చేశా. సోషల్‌విూడియాలో అది బాగా వైరల్‌గా మారింది. ఇది కేవలం ప్రమోషన్ మాత్రమేనని, నిజమైన రేవ్ పార్టీ కాదని చాలామందికి అర్థమైంది. ఆ వీడియోపై ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశా. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అనేది తెలుసుకొని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. నేను మందు తాగను.
సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్‌లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా? వ్యక్తిగతంగాను కామెంట్స్ చేశారు. సర్జరీ కారణంగా నేను లావయ్యానని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా? జర్నలిస్టులంటే నిజానిజాలను తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేవారు. ఏవిూ తెలుసుకోకుండా వచ్చి ఇలా ఇంటర్వ్యూల్లో కూర్చొనేవాళ్లు కాదు. విూరెలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో అర్థంకావడం లేదు. విూకు ఏవిూ వర్క్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఏవిూ తెలుసుకోకుండా ఇలా ఊరికే మాట్లాడకండి. విూరు పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. విూ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే నా సమాధానం మరోలా ఉండేది‘ అంటూ ఆమె సీరియస్ అయ్యారు. జబర్దస్త్ కామెడీ షోతో రోహిణి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేస్తున్నారు. ’సేవ్ ది టైగర్స్’ సిరీస్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇంకా చదవండి: 'ఛోళీకే పీఛే క్యాహై' అంటూ..మాధురి స్టెప్పులు
# Rohini # Instagram # SavetheTigers # TeluguCinema