ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్

4 months ago | 48 Views

ఎటువంటి పాత్రలోనైనా జీవించగల విలక్షణ నటుడు రావు రమేష్. ఆయన హీరోగా రూపొందిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పణలో ఆగస్టు 23న థియేటర్లలో విడుదల అవుతోంది.

'మారుతి నగర్ సుబ్రమణ్యం' శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా బుధవారం (ఆగస్టు 21న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్న ఆ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.


అల్లు అరవింద్ కుమారుడినని, అల్లు అర్జున్ తన అన్నయ్య అని భావించే యువకుడిలా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్ తనయుడి పాత్ర ఉంటుందని, అందులో అంకిత్ కొయ్య నటించారని దర్శకుడు లక్ష్మణ్ కార్య తెలిపారు. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ 'మేడం సార్ మేడం అంతే' పాటను తెరకెక్కించామని ఆయన చెప్పారు. 

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.

ఇంకా చదవండి: 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'లో నా క్యారెక్టర్ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది - రమ్య పసుపులేటి ఇంటర్వ్యూ

# MaruthiNagarSubramanyam     # RaoRamesh    

related

View More
View More

trending

View More