''పాట రాసాను..పాడాను'' అంటున్న ఫరియా!

''పాట రాసాను..పాడాను'' అంటున్న ఫరియా!

3 months ago | 42 Views

శ్రీసింహా హీరోగా రానున్న చిత్రం 'మత్తు వదలరా 2’ రితేశ్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫరియా అబ్దుల్లా  కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈసందర్భంగా విూడియాతో మూవీ టీమ్‌ ముచ్చటించింది. 'నేను వర్క్‌ చేసిన టీమ్‌లలో ఇది బెస్ట్‌. షూటింగ్‌ చాలా సరదగా జరిగింది. ఈ సినిమా కోసం నేను ఓ పాట రాశాను. దాన్ని నేనే పాడి కొరియోగ్రఫీ చేశాను. కొత్తగా ఉంటుంది. ఎంజాయ్‌ చేస్తారు‘ అని ఫరియా అన్నారు. 'మత్తు వదలరా’తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. 5 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్‌కు వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఫస్ట్‌ పార్ట్‌కు థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. దీని సీక్వెల్‌ను అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని కాలభైరవ చెప్పారు. మొదటిభాగం అంచనాలకు మించి విజయం సాధించిందని శ్రీసింహా ఆనందం వ్యక్తంచేశారు.

ఇంకా చదవండి: ఐశ్వర్యతో ఆన్‌స్క్రీన్‌ బాగా ఉంటుంది : విక్రమ్‌

# FariaAbdullah     # Tollywood    

trending

View More