మాస్‌ హీరోగా కనిపించడమే ఇష్టం అంటున్న నాని..

మాస్‌ హీరోగా కనిపించడమే ఇష్టం అంటున్న నాని..

4 months ago | 63 Views

పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని అష్టా చమ్మా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత, ఈగ చిత్రంతో ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి చిత్రంలో నటించే ఛాన్స్‌ను కొట్టేశాడు. ఆ తరువాత నానికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడే సుబ్రమణ్యం, భీమిలి కబడ్డి జట్టు, అలా మొదలైంది, పిల్లా జవిూందార్‌, భలే భలే మగాడివోయ్‌,జెర్సీ, నేనులోకల్‌, ఎమ్‌సీఎ, నిన్నుకోరి, శ్యామ్‌ సింగరాయ్‌, దసరా వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆయన ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ నెలలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేచురల్‌స్టార్‌గా పక్కింటి కుర్రాడిగా కనిపించే నానికి లవ్‌స్టోరీస్‌, ఫ్యామిలీఎంటర్‌టైనర్‌ చిత్రాలే ఇప్పటి వరకు హిట్స్‌ను తీసుకొచ్చాయి. అయితే నానికి మాత్రం తను మాస్‌ హీరోగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలు చేయాలని కోరిక. అందుకే ఆ తరహా సినిమాలు వీ, దసరా, శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాలను చేసి తన కోరిక తీర్చుకున్నాడు.


అయితే ఆ చిత్రాలు నానికి అంతగా సంతృప్తి నివ్వలేదు. అందుకే సరిపోదా శనివారం తరువాత వరుసగా మూడు మాస్‌ సినిమాల్లో నాని కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హిట్‌ 2 చిత్రంలో అర్జున్‌ సర్కార్‌గా కనిపిస్తున్న నాని త్వరలో మరో రెండు చిత్రాల్లో మాస్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న నాని ఆ తరువాత సుజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు.

ప్రస్తుతం సుజిత్‌ పవన్‌కళ్యాన్‌తో ఓజీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత నానితో చేయబోయే సినిమా వుంటుంది. అయితే ఈ చిత్రంలో నాని ఫెరోషియాస్‌, యాంగ్రిమెన్‌గా ఫుల్‌ మాస్‌ హీరోగా కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని నానినే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంతేకాదు తనను ఇలా ఓ మాస్‌ హీరోగా చూడాలన్న తన అభిమానుల కోరిక కూడా ఈ సినిమాతో తీరబోతుందని అంటున్నాడు నాని.

ఇంకా చదవండి: థియేటర్లకు రాకుండా చేస్తున్నాం: దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

# SaripodaaSanivaaram     # Nani     # PriyankaMohan     # SJSurya    

trending

View More