అర్థం చేసుకునే..ఓ మంచి భర్త కావలెను:  నటి శృతి హాసన్‌ తన పార్టనర్‌పై ఆసక్తికర పోస్ట్‌

అర్థం చేసుకునే..ఓ మంచి భర్త కావలెను: నటి శృతి హాసన్‌ తన పార్టనర్‌పై ఆసక్తికర పోస్ట్‌

2 months ago | 5 Views

సోషల్‌ విూడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి శ్రుతిహాసన్‌ తన సినిమా అప్‌డేట్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంటారు. సోషల్‌ విూడియాతో పాటు వరుస ఇంటర్వ్యూల్లోనూ సందడి చేస్తుంటారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పారు. ఆదర్శవంత మైన భాగస్వామి తన పార్ట్‌నర్‌తో సరదాగా ఉండాలన్నారు. ఎప్పుడూ జోక్స్‌ వేసి నవ్వించాలన్నారు. సృజనాత్మకంగా ఉండాలని ఇతరుల్లో స్ఫూర్తినింపే ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇటీవల శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్పిన విషయం తెలిసిందే. 'విూరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా’ అని ఓ నెటిజన్‌ అడగ్గా.. దానికి శ్రుతి సమాధానమిచ్చారు. 'నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నాను.


ఇప్పుడు నేను సింగిలే. రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి పనిలో మునిగిపోయాను. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా’ అని తెలిపారు. దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో శ్రుతి హాసన్‌ ప్రేమలో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రకటించారు. ఇటీవల ఆయనతో బ్రేకప్‌ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్‌ పెట్టారు ‘ఇదొక క్రేజీ ప్రయాణం. ఇందులో నాగురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇతరుల గురించీ అర్థం చేసుకున్నా'' అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రుతి 'డకాయిట్‌’లో నటిస్తున్నారు. అడివిశేష్‌ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రానున్న'కూలీ’లోనూ నటిస్తున్నారు. అలాగే సూపర్‌హిట్‌ చిత్రం 'సలార్‌’కు కొనసాగింపుగా రానున్న 'సలార్‌ శౌర్యంగపర్వం’లో నటించనున్నారు. త్వరలో ఇది పట్టాలెక్కనుంది.

ఇంకా చదవండి: మాట నిలబెట్టుకున్న హీరో కిరణ్ అబ్బవరం, "లవ్ రెడ్డి" సినిమాకు నైజాం, ఆంధ్రా, సీడెడ్ లో నాలుగు ఫ్రీ షోస్ ఏర్పాటు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Shrutihaasan     # Lokeshkanagaraj     # Salar    

trending

View More