ప్రభాస్‌తో పెళ్లి  నిజమైతే బాగుండు అనుకున్నా

ప్రభాస్‌తో పెళ్లి నిజమైతే బాగుండు అనుకున్నా

3 months ago | 46 Views

గత కొన్నేళ్లుగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్‌ మీడియాలో న్యూస్‌ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్‌ సహా పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్‌ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్‌ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా అన్నారు.

తాజాగా హైదరాబాద్‌లో ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 వేడుకలు జరగగా.. అవార్డుల ప్రదానోత్సవంలో పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటివరకూ మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్‌ ఏంటి? అనే ప్రశ్నకు పాయల్‌ బదులిచ్చారు. ‘ప్రభాస్‌తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి నేను బాగా నవ్వుకున్నా. ఆ వార్తలు నిజమైతే బాగుండు అని కూడా అనుకున్నా’ అని సరదాగా అన్నారు.

ప్రభాస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని పాయల్‌ పలు సందర్భాల్లో చెప్పారు. అవకాశం వస్తే ఆయనతో యాక్ట్‌ చేస్తానని కూడా చెప్పారు.'ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో పాయల్‌ రాజ్‌పుత్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే తెలుగు యువత హృదయాలు దోచుకున్నారు. వెంకీమామ, ఆర్‌డీఎక్స్‌ లవ్‌, డిస్కో రాజా, జిన్నా, తీస్‌ మార్‌ ఖాన్‌, మాయాపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల రక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం గోల్‌మాల్‌, ఏంజెల్‌, కిరాతక సినిమాల్లో నటిస్తున్నారు.

ఇంకా చదవండి: 'కల్కి’లో కమల్‌హాసన్‌ పాత్రను వదులుకున్న హీరో?

# Prabhas     # HanuRaghavapudi