ఆమెలో నాకు అదే నచ్చింది : కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన అమీర్‌ఖాన్‌

ఆమెలో నాకు అదే నచ్చింది : కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన అమీర్‌ఖాన్‌

4 days ago | 5 Views

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమీర్‌ ఖాన్‌. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఆయన ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండ్‌ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని, తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసిన అమీర్ ఖాన్‌ జీవితంలోకి మళ్లీ కొత్త ప్రేమ ప్రవేశించిందని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఆమీర్‌ ఖాన్‌ ఓ యువతితో డేటింగ్‌ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తుంది. ఆమె పేరు గౌరి. అమీర్ ఖాన్‌  రీసెంట్‌ గా తన 60వ పుట్టినరోజు సందర్భంగా కొత్త స్నేహితురాలిని పరిచయం చేశాడు. ఇప్పుడు గౌరి అమీర్ ఖాన్‌ లో తనకు నచ్చిన విషయాన్ని వెల్లడించింది.  ఈ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ముందుగాఅమీర్ ఖాన్‌  మాట్లాడుతూ.. గౌరీలో తనకు నచ్చిన విషయాన్ని వెల్లడించాడు. ‘నన్ను ప్రశాంతంగా ఉంచే, నాకు పీస్‌ ను ఇచ్చే భాగస్వామి కోసం నేను వెతుకుతున్నాను.’ గౌరికి ఆ లక్షణాలు ఉన్నాయి అని అమీర్ ఖాన్‌  అన్నారు.

Who is Aamir Khan's new girlfriend Gauri Spratt? Here's all you need to  know - Hindustan Times

అలాగే గౌరీ మాట్లాడుతూ.. ‘నాకు మంచి వాడు, సౌమ్యుడైన, శ్రద్ధగల వ్యక్తి అవసరం.’ ‘‘అప్పుడు నేను అమీర్ ఖాన్‌ ను కలిశాను’’ అని గౌరి తెలిపింది. అమీర్ ఖాన్‌ ,  గౌరీ 25 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. 25  సంవత్సరాలుగా తెలిసినప్పటికీ  ఇద్దరి మధ్య అంతగా మాటలు ఉండేవి కాదు. ‘‘మేము ఒకటిన్నర సంవత్సరం క్రితం మళ్ళీ పరిచయమయ్యాము’’ అని అమీర్ ఖాన్‌ అన్నారు.  గౌరి బెంగళూరులో పెరిగింది. అతను సౌత్‌ సినిమాల అభిమాని. ఆమె పెద్దగా హిందీ సినిమాలు చూడలేదు. గౌరీ ఏడాది క్రితం అమీర్ ఖాన్‌  నటించిన ‘దిల్‌ చాహ్తా హై’, ‘లగాన్‌’ సినిమాలు చూసిందట. ఇక అమీర్ ఖాన్‌  మార్చి 14, 1965న జన్మించాడు. అదేవిధంగా, గౌరి ఆగస్టు 21, 1978న జన్మించింది. ఇద్దరి మధ్య దాదాపు 14 సంవత్సరాల గ్యాప్‌ ఉంది. ఈ విషయం గురించి బాలీవుడ్‌ లో చాలా చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి: హాట్‌ బ్యూటీ హనీరోజ్‌ పై తీవ్ర నటి ఫరా శిబిలా ఆరోపణలు

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అమీర్‌ఖాన్‌     # గౌరి     # లగాన్‌    

trending

View More