ఆ సీక్వేల్‌కు నేను సూట్ కాదనిపించింది : నయనతార
1 month ago | 5 Views
నయనతార నటించిన ‘ముక్తిఅమ్మన్’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! దర్శకుడిగా ఆర్జే బాలాజీకు మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్తి అమ్మన్ 2’ సిద్థమవుతోన్న విషయం తెలిసిందే. సి.సుందర్ దర్శకుడు. అయితే ఈ సీక్వెల్‌కు ఆర్జే బాలాజీ దూరంగా ఉన్నారు. దీనిపై బాలాజీ స్పందించారు. సీక్వెల్‌పై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని అన్నారు. ‘‘ముక్తి అమ్మన్’ కథ నేనే రాశాను. నయనతారను కథానాయికగా తెరకెక్కించగా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించడంపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. కాకపోతే నయన్ దగ్గర ఒక ఐడియా ఉంది. దానికి నేను సెట్ కాననిపించింది.
ఈ క్రమంలోనే ఆమె వేరే దర్శకుడితో వర్క్ చేస్తున్నారు. అంతేకానీ క్రియేటివ్ విషయంలో మా మధ్య ఎలాంటి విభేధాలు లేవు. నన్ను ఈ పరిశ్రమకు పరిచయం చేసింది సుందర్. ఇప్పుడు ఆయన నా సినిమా సీక్వెల్ కోసం వర్క్ చేస్తున్నారు. అందుకు ఆనందంగా ఉంది. ఏం జరిగినా అది అంతా నా మంచికే అనుకుంటున్నా.
సూర్య చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టం’’ అని అన్నారు. నయన్-ధనుష్ వివాదంపై స్పందించమని ఓ రిపోర్టర్ కోరగా ‘‘ఆ వివాదాన్ని నెటిజన్లు వినోదంగా చూస్తున్నారు. నయనతార చేసిన వ్యాఖ్యలపై ధనుష్ ఏమీ స్పందించలేదు. అలాంటప్పుడు నేను ఎలా కామెంట్ చేస్తాను. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత విషయం. కాబట్టి వాళ్లనే పరిష్కరించుకోనిద్దాం’’ అని బదులిచ్చారు. ఆర్జే బాలాజీ కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించారు. ‘స్పైడర్’తో తెలుగువారికి చేరువయ్యారు. ‘ముక్తి అమ్మన్’తో మెగా ఫోన్ పట్టారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా హిట్ అందుకున్నారు.ఈ చిత్రం తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా విడుదలైంది. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్‌తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సూర్య 45 కోసం వర్క్ చేస్తున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది.
ఇంకా చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి