సోషల్‌ విూడియా ట్రోల్స్‌ పట్టించుకోను : మనసులో మాట చెప్పిన బ్యూటీ జాన్వీ

సోషల్‌ విూడియా ట్రోల్స్‌ పట్టించుకోను : మనసులో మాట చెప్పిన బ్యూటీ జాన్వీ

4 months ago | 43 Views

తనపై ప్రముఖ సోషల్‌ విూడియా వెబ్‌సైట్‌   ’రెడిట్‌'లో  వచ్చే ట్రోల్స్‌ గురించి తన సోదరి చెప్పేవరకు తెలియదని బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ అన్నారు. తాజా చిత్రం ’ఉలజ్’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై స్పందించారు. 'నాకు సోషల్‌ విూడియా అంటే భయం. దానికి దూరంగా ఉంటాను. ’రెడిట్‌'లో చాలా మంది నిన్ను ట్రోల్‌ చేస్తున్నారు అక్క అని ఖుషీ చెప్పే వరకు నాకు తెలియదు. వాటిని చూశాక ఎలా స్పందించాలో అర్థంకాలేదు. అందులో దారుణమైన ట్రోల్స్‌ కూడా ఉన్నాయి. వాటిని నేను పట్టించుకోను' అని చెప్పారు.గతంలోనూ జాన్వీ ఆన్‌లైన్‌ వేదికగా స్టార్‌ కిడ్స్‌ ఎదుర్కొంటున్న విమర్శలపై పలుసార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సోషల్‌విూడియా కల్చర్‌ అది. నువ్వు పబ్లిక్‌ ఫిగర్‌ అయినా, కాకపోయినా ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆ కామెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విషయంలో ఈరోజు పొగిడిన వాళ్లే.. రేపు తిడతారు. మనకు తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు‘ అని అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ’ఉలజ్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా తెరకెక్కించారు.  జాన్వీ ఇందులో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణిగా కనిపించనుంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌లో గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇంకా చదవండి: కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి.. నవీన్‌ పోలిశెట్టి తాజా వీడియో విడుదల!

# Janhavikapoor     # Socialmedia     # Bollywood