'ఆదిపురుష్‌' ఫెయిల్‌ కావడంతో ఏడ్చేశాను: నటి కృతి సనన్‌

'ఆదిపురుష్‌' ఫెయిల్‌ కావడంతో ఏడ్చేశాను: నటి కృతి సనన్‌

4 months ago | 42 Views

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'ఆదిపురుష్‌' బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌ రాధేశ్యామ్‌ తర్వాత మరో డిజాస్టార్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా పరాజయంపై తాజాగా స్పందించింది నటి కృతి సనన్‌. ఆదిపురుష్‌ ప్లాప్‌ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ప్రాణం పెట్టిన సినిమాలు పరాజయం అయితే తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. కొన్నిసార్లు ఏడ్చేస్తాం. అయితే ఈ తప్పు ఎక్కడ జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటివారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం అనేది మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్ట్‌ వెనుక ఉద్దేశం పాజిటివ్‌గానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అది కొందరికి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా ఈ అనుభవాల నుండి మనం చాలా నేర్చుకుంటాం.

ఒక నటిగా నేను ఎప్పుడు పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. తర్వాతి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలి. ఒక సినిమా హిట్‌ అవ్వడం అనేది చాలా ఆంశాల విూదా ఆధారపడి ఉంటుంది. అప్పటివరకు మన పనిని మనం 100 శాతం పూర్తి చేసుకుంటూ వెళ్లాలి అంటూ కృతి వెల్లడించింది.  గతేడాది 'క్రూ’, 'తేరీ బాతోన్‌ మే ఐసా ఉల్జా జియా’ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ భామ ప్రస్తుతం దోపట్టి అనే సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌ నటి కాజోల్‌ దేవ్‌గణ్‌ నటిస్తున్న ఈ సినిమాకు శశాంక చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంకా చదవండి: స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌.. బన్నీ వాసు భావోద్వేగం

# Adipurush     # KritiSanon     # Prabhas    

trending

View More