పెళ్లి ఎప్పుడో చెప్పలేను.. దానిపై అంతగా ఆసక్తి కూడా లేదు : 'థగ్‌లైఫ్' ప్రమోషన్‌లో నటి త్రిష కామెంట్స్
22 days ago | 5 Views
నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి త్రిష. అయితే, ఆమె వైవాహిక బంధంలోకి ఎప్పుడు అడుగు పెడుతుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వివాహంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని వ్యాఖ్యలు చేశారు. 'థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. 'మూడుముళ్ల బంధంపై విూ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా.. నిజం చెప్పాలంటే నాకు వివాహంపై నమ్మకం లేదు.
నాకు పెళ్లి అయినా ఓకే, కాకపోయినా ఫర్వాలేదని ఆమె బదులిచ్చారు. ఆమె ఇచ్చిన సమాధానంతో పక్కనే ఉన్న కమల్‌హాసన్ షాకయ్యారు. త్రిష పెళ్లి గురించి కొంతకాలంగా వదంతులు వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. ఆమె ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ వదంతులను ఆమె ఖండించారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే నా వద్ద సమాధానం లేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో మాత్రం నాకే తెలియదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం నాకు తోడు ఉంటాడనే నమ్మకం కలగాలి. అప్పుడే చేసుకుంటాను. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురుకాకూడదని ఓ సందర్భంలో చెప్పారు. 'థగ్ లైఫ్’ విషయానికి వస్తే..
మణిరత్నం - కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే ఇది. సుమారు 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రమిది. శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చిత్రబృందం పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న త్రిష.. 'థగ్ లైఫ్’లో అవకాశం వచ్చినందుకు సంతోషంగా భావిస్తున్నా. కమల్‌హాసన్ లాంటి గొప్ప నటుడితో స్కీన్ర్ పంచుకోవడం నా అదృష్టం అని తెలిపారు.
ఇంకా చదవండి: సంగీత సామ్రాట్ తో సహకారం – నా కల నిజమైంది: కీరవాణి ‘షష్టిపూర్తి’ టీజర్ వేదికగా
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!