నేను ఒంటరినని చెప్పలేదే: కీర్తిసురేశ్‌

నేను ఒంటరినని చెప్పలేదే: కీర్తిసురేశ్‌

4 months ago | 40 Views

కెరీర్‌ ఆరంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని నటి కీర్తి సురేశ్‌  తెలిపారు. తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందాయని.. దాంతో చాలామంది తనని విపరీతంగా విమర్శించారని ఆమె చెప్పారు. వారి మాటల వల్ల కొన్ని సందర్భాల్లో తాను ఎంతో బాధపడ్డానని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. అంతేకాకుండా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి మాట్లాడుతూ తాను సింగిల్‌ కాదని తెలిపారు.వర్క్‌ లైఫ్‌ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. మనసుకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్‌ చేస్తున్నా. కెరీర్‌ ఆరంభంలో నేను యాక్ట్‌ చేసిన చాలా చిత్రాలు ఎª`లాప్‌ అయ్యాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. నాకు తెలిసి అత్యధిక ట్రోల్స్‌ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే. ’మహానటి’ తర్వాత నాపై ట్రోల్స్‌ తగ్గాయి. విమర్శలను నేనూ స్వాగతిస్తా.

వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. కానీ, కొంతమంది కావాలని నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఎక్కడా రియాక్ట్‌ కాను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తున్నా అని కీర్తి సురేశ్‌ తెలిపారు. పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి అని నా భావన అని అన్నారు. దీంతో విలేకరి సింగిల్‌గా ఉంటున్నారు. బోర్‌గా అనిపించడం లేదా? అని ప్రశ్నించగా.. సింగిల్‌ అని నేను చెప్పలేదుగా అని నవ్వుతూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కీర్తిసురేశ్‌ రిలేషన్‌లో ఉన్నారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆమె పరోక్షంగా చెప్పిందనుకుంటున్నారు. కీర్తిసురేశ్‌ నటించిన తాజా చిత్రం ’రఘు తాత’. సుమన్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. మరోవైపు, ఆమె ’బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి: మొహమంతా రక్తంతో నటి అనసూయ

# KeerthySuresh     # RaghuThatha     # August15    

trending

View More