లేట్ విషయంలో నేనేం చేయలేను : దేవీశ్రీ ప్రసాద్
1 month ago | 5 Views
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కొన్ని కాంబోల్లో సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ రికార్డుల గురించే అంతటా చర్చ నడుస్తుంటుంది. అలాంటి జాబితాలో టాప్‌లో ఉంటుంది మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్. ఈ ముగ్గురి కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే 'పుష్ప 2 ది రూల్' సినిమా విషయంలో మాత్రం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ నెట్టింట వినిపిస్తూనే ఉంది. దీనిక్కారణం ఈ సారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో డీఎస్పీతోపాటు మరికొందరు సంగీత దర్శకులకు ఇవ్వడమనేది అంతటా నడుస్తున్న చర్చ.
ఈ విషయం నిజమేనని 'పుష్ప 2 ది రూల్' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మరోసారి తేలిపోయింది. ఈవెంట్‌కు దేవి శ్రీ ప్రసాద్ కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నవీన్ యేర్నేని డీఎస్పీని అడిగారు. దీంతో స్టేజ్‌పైనే తన సహనాన్ని నవ్వుతూ బయటపెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. పాటలు లేటని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేటని తనను అంటూనే ఉంటారని,. ఇప్పుడు కూడా ఫంక్షన్‌కు ఆలస్యంగా వచ్చానని ఫీలయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని తనదైన స్టైల్‌లో చురకలంటించాడు డీఎస్పీ. ఎవరూ క్రెడిట్ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్ అయినా, స్క్రీన్‌పై క్రెడిట్ అయినా తప్పదన్నాడు దేవీ శ్రీ ప్రసాద్. టైంకు పాట ఇవ్వలేదు.. టైంకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైంకు ప్రోగ్రామ్ రాలేదని ఎక్కువ కంప్లైట్స్ చేస్తూ ఉన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయన్నాడు డీఎస్పీ. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతున్న నేపథ్యంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి కాలేదని.. సుకుమార్ అండ్ టీం అదనంగా ఎస్ థమన్, అజనీష్ లోక్‌నాథ్, శ్యామ్ సీఎస్‌ను తీసుకోవడం డీఎస్పీకి నచ్చలేదని నెటిజన్లు, మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. మరి సినిమా విడుదల నేపథ్యంలో ఎలాంటి ప్రభావం పడకుండా డీఎస్పీ, నిర్మాతలు రాజీకి వస్తారా..? అనేది చూడాలి.
ఇంకా చదవండి: రెహమాన్ బాటలోనే మోహిని డే విడాకులు... రెహమాన్‌తో సంబంధంపై సర్వత్రా పుకార్లు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# దేవీశ్రీప్రసాద్ # సుకుమార్ # పుష్ప2దిరూల్ # డిసెంబర్5