నేను బాలీవుడ్‌ క్వీన్‌ ఐశ్వర్య రాయ్‌ కొడుకును....

నేను బాలీవుడ్‌ క్వీన్‌ ఐశ్వర్య రాయ్‌ కొడుకును....

1 month ago | 5 Views

బాలీవుడ్‌ క్వీన్‌ ఐశ్వర్య రాయ్‌ ఈ మధ్య కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక వైపు భర్త అభిషేక్‌ బచ్చన్‌తో విడాకులు అంటూ రూమర్స్‌ చక్కర్లు కొడుతుండగా మరోవైపు ఐశ్వర్య ఫ్యామిలీ ఫంక్షన్‌లో అభిషేక్‌ కనిపించలేదంటూ ఎదో ఒక వార్త ఐశ్వర్యని వార్తల్లో నిలిచేలా చేస్తోంది. ఇక ఐశ్వర్య కూతరు ఆరాధ్య, మామ అమితాబ్‌ బచ్చన్‌కి సంబంధించిన ఏదో ఒక వార్తలో ఈ విశ్వసుందరి ప్రస్తావన వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను  బాలీవుడ్‌ క్వీన్‌ ఐశ్వర్య రాయ్‌ కొడుకును...అంటూ వైజాగ్‌కి చెందిన ఓ వ్యక్తి వీడియో చేయడంతో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ ఏమైందంటే.


ఒకవైపు ఐశ్వర్య-అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు అభిమానుల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటే.. ఓ వైరల్‌ వీడియో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. వైజాగ్‌కి చెందిన సంగీత్‌ కుమార్‌ తాను ఐశ్వర్య కుమారుడినని, ఆమె పెళ్లి కాకముందే నేను ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌’’ ద్వారా జన్మించానని చెబుతున్నాడు. తాను లండన్‌లో పుట్టానని, మొదట ఐశ్వర్య పేరెంట్స్‌ నన్ను పెంచారు, తర్వాత తనని వైజాగ్‌లో వేరే వాళ్లకు అప్పగించినట్లు చెప్పుకున్నాడు. ఇక తాను ఐశ్వర్యకు పుట్టినట్లు సాక్ష్యాలు లేకుండా ఆధారాలను ధ్వంసం చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని విచారించగా మతిస్థిమితం లేని వాడిగా తెలిసింది. అయితే ఈ వీడియో గతంలోదైనా  ఐశ్వర్య-అభిషేక్‌ విడాకుల వార్తల నేపథ్యంలో మరోసారి వైరల్‌ అయ్యింది.

ఇంకా చదవండి: రాక్షసుడిలా ప్రభాస్‌!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అభిషేక్‌ బచ్చన్‌     # ఐశ్వర్య రాయ్‌     # నిమ్రత్‌ కౌర్‌    

trending

View More