ప్రభాస్‌ సినిమాలో నేను లేను: అభిమానులకు షాకిచ్చిన మృణాల్‌ ఠాకూర్‌

ప్రభాస్‌ సినిమాలో నేను లేను: అభిమానులకు షాకిచ్చిన మృణాల్‌ ఠాకూర్‌

4 months ago | 43 Views

వరుస విజయాలతో జోష్‌ విూదున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన 'సీతారామం’ బ్యూటీ మృణాల్‌ నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ప్రభాస్‌తో  మృణాల్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. ’ఇది హను రాఘవపూడి చిత్రం ఫస్ట్‌లుక్‌’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై మృణాల్‌ స్పందించారు.'విూ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నందుకు క్షమించండి.

నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని కామెంట్‌ చేశారు. దీంతో రూమర్‌కు చెక్‌ పడింది.  మరి ఇందులో ప్రభాస్‌ సరసన ఎవరు కనిపిస్తారో అనే చర్చ మరోసారి మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం రానుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్‌ కూడా సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ’ఫౌజీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 17న రానున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి: ఎన్టీఆర్‌కు గాయాలంటూ..ప్రచారం... క్షేమంగానే ఉన్నారంటూ స్పష్టీకరణ!

# MrunalThakur     # Prabhas     # Agusut17    

trending

View More