ఒకేసారి 500 మందితో హృతిక్‌, ఎన్‌టీఆర్‌ డ్యాన్స్‌!

ఒకేసారి 500 మందితో హృతిక్‌, ఎన్‌టీఆర్‌ డ్యాన్స్‌!

1 month ago | 5 Views

దేవరతో సాలిడ్‌ హిట్‌ అందుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ ప్రస్తుతం వార్‌ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వార్‌ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్‌ కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అయన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న

ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య క్రేజీ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సినిమాలోని పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్‌?ర్లను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. 500 మంది డ్యాన్సర్లతో హృతిక్‌, ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేస్తుంటే థియేటర్‌లు ఏ రేంజ్‌లో ఊగిపోతాయో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే ఈ డ్యాన్స్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఓ సరికొత్త గీతాన్ని తీర్చిదిద్దుతుంది చిత్రబృందం. యష్‌రాజ్‌ స్టూడియోలో ప్రస్తుతం ఈ డ్యాన్స్‌ షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి:  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సోనాక్షి సిన్హా!?

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# వార్‌ 2     # ఎన్‌టీఆర్‌     # హృతిక్ రోషన్    

trending

View More