గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన హాలీవుడ్ న‌టుడు లుకాస్ బ్రావో

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన హాలీవుడ్ న‌టుడు లుకాస్ బ్రావో

5 months ago | 37 Views

ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు జీవం పోసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కులే కాదు.. హాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. గ్లోబ‌ల్ స్టార్ న‌ట‌ను ఎందో హాలీవుడ్ యాక్ట‌ర్స్ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ యాక్ట‌ర్ లుకాస్ బ్రావో కూడా ట్రిపులార్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ స‌మయంలో ఇండియ‌న్ సినిమాల్లో మీకు నచ్చిన న‌టుడు గురించి చెప్ప‌మ‌ని అడిగిన‌ప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశాన‌ని చెప్పిన లుకాస్ బ్రావో. "RRR లో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడు. అతను చేసే విన్యాసాలు మరియూ తెరపై ఎమోషనల్ ప్రెజెన్స్ అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అని పేర్కొన‌టం విశేషం.


ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి ఆస్కార్ అవార్డును తెచ్చిన సినిమా మ‌న తెలుగు సినిమా.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌గా, తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించారు. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1200 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఇంకా చదవండి: చియాన్‌ విక్రమ్‌ నటన అదుర్స్‌.. 'తంగలాన్‌'పై ప్రేక్షకుల ఛీర్స్‌!

# Rrr     # Ramcharan     # Lucasnicolasbravo    

trending

View More