హాయ్.. నేను రానా దగ్గుబాటి.. ట్రైలర్ షో విడుదల
1 month ago | 5 Views
టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గు బాటి కాంపౌండ్ నుంచి టాక్ షో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ది రానా దగ్గుబాటి షో ట్రైలర్‌ను విడుదల చేశారు.
హాయ్.. నేను రానా దగ్గుబాటి.. అవును ఇది ఒక షో. కానీ మీరంతా ఈ షో దేని గురించి ఆశ్చర్యపోతున్నారు. నాకింకా ఏం తెలియదు.. అంటూ ఇంట్రో మొదలుపెట్టాడు రానా.ఆ తర్వాత షోలోకి గెస్టులుగా నాగచైతన్య, శ్రీలీల, సిద్దు జొన్నలగడ, నాని, ప్రియాంకా ఆరుళ్ మోహన్, ఎస్‌ఎస్ రాజమౌళి, తేజ సజ్జా దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ, మీనాక్షి చౌదరి, రిషబ్ శెట్టి లాంటి స్టా్ల్న ఎంట్రీ ఇచ్చారు.
స్టార్ సెలబ్రిటీలతో టాక్ షో ఉండబోతున్నట్టు రానా తెలియజేశాడు. రానా అండ్ సెలబ్రిటీల స్టైల్‌లో సాగే ఈ సిరీస్ నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఫిల్టర్ చేయని, స్క్రిప్ట్ లేని.. మరిచిపోలేనిది.. అంటూ విడుదల చేసిన ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. రానా చేయబోయే షోలో రొటీన్ అంశాలే ఉండబోతున్నాయా.. ? లేదా ప్రేక్షకులకు కొత్త యాంగిల్ ఏమైనా చూపించడబోతున్నాడా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇంకా చదవండి: మలయాళ దర్శకుడికి ఓకే చెప్పిన నాని
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# రానాదగ్గుబాటి # టాక్‌షో # టాలీవుడ్