దక్షిణాదిలో హీరోయిన్‌లంటే చిన్నచూపే: కథానాయిక మాళవికా మోహనన్
2 months ago | 5 Views
దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కథానాయిక మాళవికా మోహనన్. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం 'యుధ్రా’లో ఈ భామ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ... 'దక్షిణాదిలో హీరో కేంద్రంగానే సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతాయి.
కథానాయికలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే ఆపాదిస్తారు. ఒకవేళ పరాజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్‌ను అన్‌లక్కీ అని, ఆమె వల్లే సినిమా ప్లాప్ అయిందని మాట్లాడతారు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌విూడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి 'రాజా సాబ్’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నది. ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, అభినయానికి ఆస్కారం ఉన్న మంచి పాత్ర ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
ఇంకా చదవండి: 'దేవర-2' కోసం శివకు సెలవిచ్చా: ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడి