
హీరోయిన్ సంధ్య ఇలా మారిపోయిందా..?
1 month ago | 5 Views
వాలెంటైన్స్ డే.. ఈ సందర్భంగా థియేటర్లలో ఒకప్పటి ప్రేమకథలు చిత్రాలు మరోసారి సందడి చేస్తున్నాయి. అలాగే సినీప్రియుల మదిలో నిలిచిన అద్భుతమైన లవ్ స్టోరీ చిత్రాల్లో ప్రేమిస్తే ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ ప్రేమకథ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథ ప్రతి ఒక్కరిని హత్తుకుంది. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమా లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో భరత్, సంధ్య హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. వీరిద్దరి యాక్టింగ్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఇక ఈ సినిమాతోనే వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యింది సంధ్య. మొదటి సినిమాతోనే తెలుగులో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడిరది.
ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రేమిస్తే సినిమాతో వచ్చిన స్టార్ డమ్ ఆ తర్వాత కాపాడుకోలేకపోయింది సంధ్య. హీరోయిన్ గానే కాకుండా సహాయ నటిగా కనిపించింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. పవ్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలో పవన్ చెల్లిగా కనిపించింది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసిన సంధ్యకు అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె సినిమాలకు దూరమయ్యింది. 2015లో చెన్నైకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం గురువాయూర్ ఆలయంలో జరిగింది. వీరికి ఒక పాప జన్మించింది. ప్రస్తుతం సంధ్య తన ఫ్యామిలీ తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సంధ్య లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అందులో సంధ్య లుక్ చూసి ఆశ్యర్యపోతున్నారు నెటిజన్స్.
ఇంకా చదవండి: యూత్ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా "బ్యూటీ" పోస్టర్!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సంధ్య # హీరోయిన్