రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

4 months ago | 36 Views

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి ప్రణీత సుభాష్‌. ఇప్పటికే ఓ పాపకు జన్మనిచ్చిన ఈ నటి తాజాగా మరోమారు పండంటి బాబుకు జన్మనిచ్చింది. గురువారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తెలుగు, కన్నడ సినీ ప్రముఖులు, అభిమానుల నుండి సోషల్‌విూడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. తనీష్‌ హీరోగా వచ్చిన ’ఏం పిల్లో.. ఏం పిల్లడో’తో 2010 తెలుగులోకి అరంగేట్రం చేసింది. పేరుకు కన్నడ నటి అయినా తెలుగు చిత్రాలతోనే మంచి గుర్తింపు లభించింది. సిద్దార్థ్‌తో చేసిన బావ, పవన్‌ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్‌తో రభస, మహేశ్‌ బాబుతో బ్రహ్మోత్సవం, మంచు మనోజ్‌ ’పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాలలో నటించి ఇక్కడ యూత్‌లో అభిమానులను బాగానే సంపాదించింది. 2019 కరోనా అనంతరం సినిమా ఛాన్సులు తగ్గడంతో అడపాదడపా మాత్రమే చిత్రాల్లో కనిపిస్తూ వస్తుంది. 2021లో నితిన్‌ రాజు అనే ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్న ప్రణీత 2022లో ఓ పాప  కూడా జన్మనిచ్చింది.

తెలుగులో చివరగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్టీఆర్‌: కథానాయకుడు చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. ఇదిలా ఉండగా తన డెలివరీ అయ్యాక ప్రణీత తన సోషల్‌ విూడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం 'మా కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉంది. ప్రత్యేకించి మా కుమార్తె అర్నా తన తమ్ముడిని 'బేబీ’ అంటూ మురిసిపోతోంది. బాబు కాస్త పెద్దయ్యేవరకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి గడపాలి.

మొదటిసారి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అందరి సలహాలు వింటూ వారు చెప్పిన విధంగా నడుచుకున్నా. ఇప్పుడు రెండోసారికి ఆల్రేడీ కొన్ని విషయాలు తెలియడంతో చాలా ప్రశాంతంగా ఉన్నా.. ఎలాంటి ఒత్తిడి లేదని ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించానని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది.

ఇంకా చదవండి: తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# PranithaSubhash     # Tollywood    

related

View More
View More

trending

View More