
అట్లాంటా ఉగాది ఉత్సవాల్లో హీరోయిన్ జో శర్మ
15 days ago | 5 Views
అట్లాంటా మహానగరంలో ఘనంగా ఉగాది వేడుక
▪️ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా వేదిక
▪️ సెలబ్రిటీ గెస్టుగా పాల్గొన్న M4M హీరోయిన్ జో శర్మ
తెలుగు వారి తొలి పండగ ఉగాది అమెరికాలో ఘనంగా జరిగింది. అట్లాంటాలోని డెన్మార్క్ హైస్కూల్ ప్రాంగణంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో M4M (Motive For Murder) మూవీ హీరోయిన్ జో శర్మ సెలబ్రిటీ గెస్టుగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ వేదికపై జో శర్మను TAMA అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.
ఈ సందర్భంగా M4M (Motive For Murder) మూవీ హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) సంస్థ నిర్వహకులు జరిపిన ఈ వేడుకలకు నన్ను సెలబ్రిటీ గెస్టుగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అచ్చమైన తెలుగు సంస్కృతి ఇక్కడ ఆవిష్కృతమైంది. బంతి భోజనాలు పెట్టడం ఎంతో ఆనందమేసింది. 30 రకాల తెలుగు వారి రుచికరమైన వంటకాలతో అరిటాకులో భోజనం వడ్డించడం ఎంతో సంతృప్తి అనిపించింది. కొండపల్లి నుంచి కళాకారుల స్వహస్తాలతో తయారు చేసిన, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్న మెమోంటోలను అందించారు. TAMA అధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి గారికి, చైర్మన్ రాఘవ తడవర్తి గారికి, TAMA సంస్థలోని ప్రతి మెంబర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు'' అని తెలిపారు.
ఈ వేడుకలో జో శర్మతో పాటు కమీషనర్ టాడ్ లెవంట్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, దుగ్గిరెడ్డి, స్పాన్సర్స్, TAMA సభ్యులు, వందలాది ఎన్నారై కుటుంబాలు పాల్గొని విజయవంతం చేశారు. తెలుగు ఎన్నారైల ఆటాపాటల మధ్య, ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుక సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
ఇంకా చదవండి: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బ్లాక్ బస్టర్! థియేటర్లలో ఆడియన్స్ కేరింతలు – మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యర్నేని
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జో శర్మ