పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ చిత్ర శుక్లా
3 months ago | 5 Views
టాలీవుడ్ స్టార్స్ చాలామంది ఇటీవల కాలంలో తల్లిదండ్రులయిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటిదాకా వరుసగా టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగగా, ఇప్పుడేమో వరుసగా పేరెంట్స్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు పలువురు సెలబ్రిటీ కపుల్స్. తాజాగా తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ చిత్ర శుక్లా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా కరెక్ట్ గా తన పెళ్లి ముహూర్తానికి గుడ్ న్యూస్ అందింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. హీరోయిన్ చిత్రా శుక్లా సోషల్ మీడియా వేదికగా తను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అన్న విషయాన్ని పోస్ట్ చేసింది. నాలుగు రోజుల క్రితమే అంటే సెప్టెంబర్ 30న రాత్రి 9:31 తనకు బిడ్డ పుట్టాడని వెల్లడించిన బ్యూటీ, ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు అదే ముహూర్తానికి బాబు పుట్టడంతో ఆ టైమ్ అనేది తనకు మరింత స్పెషల్ గా మారింది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తన న్యూ బార్న్ బేబీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో అప్పుడే పుట్టిన చిత్రా శుక్లా వారసుడు చూడడానికి క్యూట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ బ్యూటీ 2023 డిసెంబర్ లో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీసు అధికారిని పెళ్లాడింది. ఇప్పుడు మగ బిడ్డని ప్రసవించి, ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఈ సెలబ్రిటీ కపుల్ పేరెంట్స్ గా మారినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా చిత్రా శుక్లా ఇండోర్ కు చెందిన అమ్మాయి. 2014 నుంచి ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ వస్తోంది. బ్యాగ్రౌండ్ డాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ హీరోయిన్ 2017లో రిలీజ్ అయిన ‘మా అబ్బాయి’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. పెద్దగా పాపులర్ కాకపోయినా చాలా వరకు సినిమాలలో నటించింది.
తెల్లవారితే గురువారం, సిల్లీ ఫెలో, రంగుల రాట్నం, హంట్, పక్కా కమర్షియల్, ఉనికి, మస్తు షేడ్స్ ఉన్నయ్ రా, కలియుగ పట్టణం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. మరి పెళ్లయిన తర్వాత ఈ హీరోయిన్ సినిమాల్లో నటిస్తుందా లేదంటే పర్సనల్ లైఫ్ కి పరిమితం అయిపోతుందా అనేది చూడాలి మరి!!
ఇంకా చదవండి: విలన్ పాత్రల నటుడు మోహన్ రాజ్ కన్నుమూత