బ్యూటిఫుల్ కేరళ టీ ఎస్టేట్స్ లో హీరో విజయ్ దేవరకొండ ఏరోబిక్ రన్
2 months ago | 5 Views
హీరో విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ కు ప్రాధాన్యతను ఇస్తారు. ఏదైనా గాయమైనా జిమ్ చేయడం ఆపరు. ప్రస్తుతం ఆయన తన "వీడీ 12" సినిమా కోసం కేరళలో షూటింగ్ చేస్తున్నారు. అందమైన కేరళ టీ ఎస్టేట్స్ సమీపంలో షూటింగ్ జరుగుతోంది. ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్య విజయ్ దేవరకొండ ఏరోబిక్ రన్ చేస్తున్నారు.
5.16 కిలోమీటర్స్ ఔట్ డోర్ రన్నింగ్ చేశారు. ఈ రన్ మధ్యలో ఎదురైన ఫారెస్ట్ ఆఫీసర్ లకు ఫొటోస్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ కేరళ ఏరోబిక్ రన్ వీడియో ఫిట్ నెెస్ గోల్స్ ఇస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వీడీ 12 సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ కానుంది.
ఇంకా చదవండి: వీడ్కోలు మిత్రమా..! రతన్ టాటా మాజీ ప్రేయసీ, బాలీవుడ్ నటీ సిమీగరెవాల్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!