బాలయ్య 'అన్‌స్టాపబుల్‌'లోకి  హీరో సూర్య ఎంట్రీ

బాలయ్య 'అన్‌స్టాపబుల్‌'లోకి హీరో సూర్య ఎంట్రీ

1 month ago | 5 Views

ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వచ్చే అన్‌స్టాపబుల్‌ షో మళ్లీ వస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్‌గా చేసే ఈ షో ఇప్పటికే మూడు సీజన్‌లను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్‌ చేసుకోని తాజాగా నాలుగో సీజన్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే నాలుగో సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఇక ఫస్ట్‌ ఎపిసోడ్‌లో చీఫ్‌ గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ అక్టోబర్‌ 25న స్ట్రీమింగ్  కాబోతుంది.


అయితే రెండో ఎపిసోడ్‌కు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. రెండో ఎపిసోడ్‌లో ముఖ్య అతిథిగా తమిళ నటుడు సూర్య హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. సూర్య అన్‌స్టాపబుల్‌ షోకు అటెండ్‌ అవుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా.. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుంది. బాబి డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్‌ షోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నార్త్‌లో ప్రమోషన్స్‌ కంప్లీట్‌ చేసుకున్న సూర్య తాజాగా టాలీవుడ్‌లో ప్రమోషన్స్‌ మొదలుపెట్టాడు.

ఇంకా చదవండి: చిత్ర పరిశ్రమ ఎంట్రీపై హీరో సూర్య ఏమంటున్నారంటే...

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అన్‌స్టాపబుల్‌     # సూర్య     # బాలయ్య    

trending

View More