క్రిస్మస్‌ తాతా వేషంలో హీరో నితిన్‌

క్రిస్మస్‌ తాతా వేషంలో హీరో నితిన్‌

14 hours ago | 5 Views

టాలీవుడ్‌ యాక్టర్‌ నితిన్‌ కాంపౌండ్‌ నుంచి వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా నేడే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. పలు కారణాల విడుదల వాయిదా పడ్డది. అయితే మూవీ లవర్స్‌లో జోష్‌ నింపేందుకు రాబిన్‌ హుడ్‌ లుక్‌ ఒకటి షేర్‌ చేశారు మేకర్స్‌. క్రిస్మస్‌ తాతగా మారిపోయి గిఫ్టులు పంచుతున్నాడు నితిన్‌. శాంటా లుక్‌లో ఉన్న నితిన్‌ ఓ చిన్నారికి క్రిస్మస్‌ కానుకను అందిస్తున్నాడు.

ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అనివార్య కారణాల వల్ల రాబిన్‌ హుడ్‌ డిసెంబర్‌ 25న విడుదల కావడం లేదు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తుండగా మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ ఏజెంట్‌ జాన్‌ స్నో పాత్రలో కనిపించబోతున్నారు. రాబిన్‌ హుడ్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇప్పటికే షేర్‌ చేసిన గ్లింప్స్‌ వీడియోలో డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్‌ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు.. అంటూ నితిన్‌ చెబుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ఇంకా చదవండి: ఇలా చేస్తే ఎలా కిర్తీ.. కిర్తీ ఆఫర్‌కు అభిమానికి ఫిదా!!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రాబిన్‌హుడ్‌     # నితిన్‌    

trending

View More