అభిమానులతో కలసి ANR క్లాసిక్ 'ప్రేమ్ నగర్' మూవీ చూసిన హీరో నాగచైతన్య
1 month ago | 23 Views
నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైయింది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.
ఈ ఫెస్టివల్ లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని శాంతి థియేటర్ లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమానులు కోలాహలంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు.
ఇంకా చదవండి: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ చేతుల మీదుగా మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# PremNagar # AkkineniNageswaraRao # NagaChaitanya