వరద బాధితులకు అండగా నిలిచిన హీరో అల్లు అర్జున్-తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం
3 months ago | 31 Views
సామాజిక సేవలతో పాటు, ఎవరికైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్. ఇంతకు ముందు పలు మార్లు తన సహాయంతో మంచి మనసు చాటుకున్న ఈ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చూపాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహార్నిశాలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు.
ఇక వారి వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా కోటి రూపాయాల విరాళం అందించడానికి ముందుకు వచ్చారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో భాదను కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు అల్లు అర్జున్.
ఇంకా చదవండి: వరద బాధితుల సహాయార్థం ఏపీ, తెలంగాణకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన రెబెల్ స్టార్ ప్రభాస్
# AlluArjun # AndhraPradesh # Telangana