'జై హనుమాన్‌' కోసం భారీగా కసరత్తు...దర్శకుడు ప్రశాంత్‌ వర్మ వెల్లడి

'జై హనుమాన్‌' కోసం భారీగా కసరత్తు...దర్శకుడు ప్రశాంత్‌ వర్మ వెల్లడి

3 months ago | 42 Views

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తర్వాత సినిమాల లిస్ట్‌ చూసి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం ఖాయమని అంటున్నారు. 'హనుమాన్‌’తో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్న ప్రశాంత్‌ వర్మ.. దాని సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఆంగ్ల విూడియాతో మాట్లాడుతూ.. 'జై హనుమాన్‌’ విడుదల తేదీ, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ గురించి వివరాలు పంచుకున్నారు. తన తర్వాత సినిమాల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా నటిస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ కోసం నేను కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ను కలిశాను. వారితో నా ఆలోచనలను పంచుకున్నాను. ఇందులో వారు కచ్చితంగా భాగమవుతారు. కాకపోతే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సినిమాటిక్‌ యూనివర్స్‌ ఇంకా ప్రారంభదశలోనే ఉంది.

'జై హనుమాన్‌’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'హనుమాన్‌’ రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే మేము దాని సీక్వెల్‌ను ఈపాటికి ఎప్పుడో విడుదల చేసేవాళ్లం. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో మా బాధ్యత కూడా పెరిగిందని అన్నారు. 'జై హనుమాన్‌’ కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు జరుగుతున్నాయి. విూ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుంది. అభిమానులు స్క్రీన్‌పై ఏ అంశాలనైతే చూడాలనుకుంటున్నారో వాటిని మేము కచ్చితంగా చూపిస్తాం. నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది. 'హనుమాన్‌’ సమయంలో మొదట షూటింగ్‌ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ పనులు ప్రారంభించాం. కానీ, దీని సీక్వెల్‌కు మాత్రం వీఎఫ్‌ఎక్స్‌ పనులు ముందే సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ సమయం పట్టవు. 'జై హనుమాన్‌’ కంటే ముందు 'అధీరా’ వస్తుంది. దీనితో పాటు మరో రెండు సినిమాలకు కూడా పనిచేస్తున్నాం. ఇతర దర్శకులు కూడా వీటి కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ నెలలో దీని షూటింగ్‌ ప్రారంభించే అవకాశముంది. ప్రతి సంవత్సరం కనీసం ఒకటి, రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం అని అన్నారు. ప్రశాంత్‌ వర్మ లైనప్‌లో తాజాగా మోక్షజ్ఞ  సినిమా చేరిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు పంచుకుంటారా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ఇంకా చదవండి: 'దేవర' ట్రైలర్‌పై అభిమానుల పెదవివిరుపు.. 'ఆచార్య'లో సీన్స్‌ రిపీట్‌ అంటూ..పోస్ట్‌లు!!!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Jaihanuman     # Prasanthvarma    

trending

View More