హీరోయిన్‌ను పెళ్లాడిన 'కలర్‌ఫొటో' చిత్రం  డైరెక్టర్‌

హీరోయిన్‌ను పెళ్లాడిన 'కలర్‌ఫొటో' చిత్రం డైరెక్టర్‌

11 days ago | 5 Views

'కలర్‌ ఫొటో' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్‌ రాజ్‌, నటి చాందినీ రావు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమలలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో సుహాస్‌ దంపతులతో పాటు నటుడు వైవా హర్ష తదితరులు హాజరై సందడి చేశారు. సందీప్‌ పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 'కలర్‌ఫొటో' సినిమాతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు సందీప్‌ రాజ్‌.

ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్‌ 'ఛాయి బిస్కెట్‌'లో షార్ట్‌ ఫిలిమ్స్‌తో కెరీర్‌ మొదలుపెట్టిన ఈ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ డెబ్యూ సినిమాగా కలర్‌ ఫొటో ఓటీటీలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. నటి చాందీని రావు విషయానికి వస్తే.. కలర్‌ఫొటో, రణస్థలి, హెడ్‌ అండ్‌ టేల్స్‌తోపాటు పలు వెబ్‌ సిరీస్‌లలో నటించించింది. చాందిని రావు ప్రొడక్షన్‌ హౌస్‌ను కూడా మెయింటైన్‌ చేస్తుంది. సందీప్‌ రాజ్‌ ప్రస్తుతం రోషన్‌ కనకాలతో  సినిమా ప్రకటించాడని తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ షురూ కానున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.

ఇంకా చదవండి: 'పుష్ప-2' చిత్రానికి జాన్వీకపూర్‌ అండ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సందీప్‌రాజ్‌     # చాందినీరావు     # కలర్‌ఫొటో    

trending

View More