హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం.

హర్ష సాయి కేసులో బాధితురాలు తరపు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం.

2 months ago | 5 Views

గత కొన్ని రోజులుగా యూట్యూబర్ హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున ఉన్న లాయర్ నాగూర్ బాబు మరియు ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు అదే విధంగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసులు వివరాలను తెలియజేశారు.

లాయర్ నాగూర్ బాబు గారు మాట్లాడుతూ : ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్లు కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయిన తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టాగ్రామ్ పేజెస్ ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాధితురాలు పైన లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మీడియా ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా వాటిని ఎంటర్టైన్ చేస్తూ బాధితురాలని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై మేము హైకోర్టును ఆశ్రయించాం. కానీ వాస్తవికంగా మీడియా చాలా సపోర్ట్ చేస్తూ అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా చేస్తున్న మోసాలను బయటపెట్టారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారు డిలీట్ చేయవలసిందిగా ధర్మాసనం నుంచి ఇంటెరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాము. అదే విధంగా ఎఫ్ఐఆర్లో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది వాదనలకు దిగి ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో బాధితురాలని మానసికంగా బాధ పెడుతున్నారు. అలా చేస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అలా నిజా నిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బి ఎన్ ఎస్ కింద కేసులు నమోదు చేసాం. బాధితురాలు పేరు ఎక్కడ కూడా నిజనిర్ధారణ జరిగే వరకు తీయకుండా న్యాయస్థానం నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాం"  అన్నారు.

నిర్మాత బాలచంద్ర గారు మాట్లాడుతూ : బాధితురాలు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో ఎంత మానసిక బాధకి గురి చేస్తున్నారు కూడా చూస్తున్నాం. కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్ష సాయి ఇబ్బంది పెడుతున్నాడు. దానికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మాకు అనుకూలంగా తీర్పు లభించింది. ఈ వార్తని మీడియాతో పంచుకోవాలని అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని నిజా నిజాలు తెలియకుండా ఎవరు ఎక్కడ చూపించరాదని న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేసింది"  అన్నారు.

ఇంకా చదవండి: 'శ్వాగ్'కు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : హీరో శ్రీవిష్ణు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# HarshaSai     # NagurBabu     # Balachandra    

trending

View More