కన్నడ చిత్రంలోనూ.. వేధింపులు... నటి నీతూశెట్టి ఆరోపణలతో కలకలం!!
3 months ago | 35 Views
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన రిపోర్ట్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని నటి నీతూశెట్టి షాకింగ్ ఆరోపణలు చేశారు. తాజాగా ఓ జాతీయ విూడియాతో మాట్లాడిన ఆమె కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. కన్నడ చిత్రపరిశ్రమలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. వాటిని బయటకు రానివ్వరు. గతంలో ఒక నిర్మాత నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. సినిమా చర్చలో భాగంగా ఆయన్ని కలిశాను. సినిమా గురించి పక్కన పెట్టి హాలీడే కోసం తనతో గోవాకు రమ్మని పిలిచాడు అని నీతూశెట్టి ఆరోపించారు. 'కన్నడ చిత్ర పరిశ్రమలో నటించిన ఏ నటినైనా అడగండి. వాళ్ల దగ్గర చెప్పడానికి తప్పకుండా ఒక వేధింపుల కథ ఉంటుంది' అని మరో నటి ఆరోపించారు. అయితే తాను ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నది చెప్పాలనుకోవడం లేదన్నారు.
జస్టిస్ హేమ కమిటీ వంటి కమిటీలు అన్నిచోట్లా ఉండాలని, అప్పుడే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె వివరించారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదికను సిద్ధం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండీషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ నివేదికలో వెల్లడించిన పలు అంశాలు అంతటా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే నటీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడంపై పలు చిత్ర పరిశ్రమలు దృష్టిపెట్టాయి. ఇటీవల కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆ పరిశ్రమకు చెందిన తారలతో సమావేశం నిర్వహించి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకుంది.
ఇంకా చదవండి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించలీ....కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి