నిజాలు బయటపెట్టినందుకు వేధింపులు: మళయాల నటి మిను వెల్లడి

నిజాలు బయటపెట్టినందుకు వేధింపులు: మళయాల నటి మిను వెల్లడి

3 months ago | 38 Views

 మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భార్రతికర విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టినందుకు తనకు సోషల్‌ విూడియా వేదికగా బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఓ నటి తెలిపారు. ప్రముఖ నటుడు జయసూర్యతోపాటు ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నా నంటూ నటి మిను మునీర్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం బయపెట్టిన దగ్గరి నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ విషయం మరో చర్చనీయాంశంగా మారింది. 2013లో ఒక ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నప్పుడు ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్యలు అసభ్య పదజాలంతో తనను దూషించినట్లు మిను ఇటీవల ఆరోపించారు. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్‌ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితివిూరాయని వాపోయారు. ఈ సంఘటన వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయానన్నారు. మరోవైపు అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌  అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. ఈ మేరకు ’అమ్మ ’ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడిరచింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి: ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలకు అండగా నిలవండి: సినీనటి ఖుష్బూ పిలుపు

# Hemacommittee     # Khushboo     # Harassment    

trending

View More