టాలెంట్‌కు వేదికగా సోషల్‌ విూడియా...ఇమాన్వీ ఎంపికపై హను రాఘవపూడి!?

టాలెంట్‌కు వేదికగా సోషల్‌ విూడియా...ఇమాన్వీ ఎంపికపై హను రాఘవపూడి!?

4 months ago | 39 Views

ప్రభాస్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న  పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా కోసం కథానాయికగా సోషల్‌విూడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ సినిమాలో కథానాయికగా ఆమెను ఎంచుకోవడంపై దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల వల్ల కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకోవడం సులభ మైందన్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొత్త టాలెంట్‌ను వెలికితీయడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తమ కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకోవడంలో ఫిల్మ్‌మేకర్స్‌కు సోషల్‌విూడియా ఎంతో సాయం చేస్తుంది. ఇమాన్వీ అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి. అందరిలాగానే నేనూ ఆమె డ్యాన్స్‌ వీడియోలు చూస్తుంటా.

ఆమె మంచి భరతనాట్యం డ్యాన్సర్‌. కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంటుంది. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నా అని హను చెప్పారు. ఆడిషన్స్‌, స్క్రీన్‌ టెస్ట్‌ అనంతరమే ఆమెను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఆమెను సెలెక్ట్‌ చేయడం తన ఒక్కడి నిర్ణయం కాదని.. చిత్రబృందం మొత్తం నిర్ణయమని ఆయన తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితం కానుంది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ’  అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇమాన్వీ విషయానికి వస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా ఆమె యువతకు సుపరిచితురాలు. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి. దాదాపు 7 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది.

ఇంకా చదవండి: ప్రభాస్‌తో సినిమాతో స్టార్‌ స్టేటస్‌.. ఇప్పుడంతా ఇమ్మాన్వీ ఇస్మాయిల్‌ కోసం సర్చ్‌!?

# Prabhas     # Imanviismail     # Raghavapudi    

trending

View More